Britain: బ్రిటన్ వీసా నిబంధనలు కఠినతరం
బ్రిటన్ ప్రభుత్వం వీసా (Visa), వలస చట్టాల్లో కఠినమైన మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులకు సంబంధించి ప్రభుత్వం పార్లమెంటులో ఒక శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టనుందన్న ఊహాగానాల నడుమ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) కొత్త విధానాన్ని మీడియాకు వెల్లడిరచారు. రాబోయే అయిదేళ్లలో వలస గణాంకాలు గణనీయంగా తగ్గించడమే వీటి ధ్వేయంగా కనిపిస్తోంది. బ్రిటన్ పౌరసత్వం కోరుకునే వలసదారులు వేచి ఉండే సమయాన్ని అయిదు నుంచి పదేళ్లకు పెంచారు. పని, కుటుంబం, చదువు ఇలా ఇమిగ్రేషను వ్యవస్థలోని ప్రతి అంశాన్ని కఠినతరం చేస్తామని, తద్వారా ప్రభుత్వానికి మరింత నియంత్రణ వస్తుందన్నారు. అలాగే ఆంగ్ల భాషాపరమైన నియమాలను కూడా పటిష్టం చేశారు. వీసా హోల్డరుపై ఆధారపడినవారు సైతం ప్రాథమిక స్థాయి ఆంగ్ల భాషా నైపుణ్యాలు కలిగి ఉండాలి. భారత్ (India) సహా విదేశీ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేశాక పని వీసా కింద బ్రిటన్లో ఉండే వ్యవధి 24 నెలల నుంచి 18 నెలలకు తగ్గుతుంది. ఈ శ్వేతపత్ర సంస్కరణల పూర్తి ప్యాకేజీని బ్రిటన్ హోం మంత్రి కూపర్ హౌస్ ఆఫ్ కామన్స్ (House of Commons ) లో ప్రవేశపెడతారు.







