అమెరికాకు భారత గ్యాంగ్స్టర్లు
భారత్‌కు చెందిన కీలక గ్యాంగ్స్టర్లు తప్పుడు పాస్‌పోర్టులతో అక్రమ మార్గాల్లో అమెరికా వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా గోగి గ్యాంగ్‌కు చెందిన హర్ష్ అలియాస్ చింటూ అనే షార్ప్ షూటర్‌ను ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా గోల్డీబ్రార్, అన్మోల్ బిష్ణోయ్, రోహిత్ గోడారా, మాంటీ మాన్, పవన్ బిష్ణోయ్ వంటి గ్యాంగ్స్టర్లు తప్పుడు పాస్‌పోర్టులు, అక్రమ మార్గాల ద్వారా అమెరికా చేరుకొని అక్కడ దాక్కొన్నారని వెల్లడిరచారు. భారత్‌లో మరో తప్పుడు పాస్‌పోర్టు పుట్టించేందుకు తిరిగి రాగా, హర్ష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు ఢల్లీిలోని ఓ సెలూన్‌పై కాల్పులు జరిపి ఇద్దరిని హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు. అతడి పాస్‌పోర్టులో ప్రదీప్ కుమార్ అని ఉండటం విశేషం. దీనిని కూడా జలంధర్‌లోనే పుట్టించారు. జూన్ 9న తొలుత షార్జాకు వెళ్లి అక్కడి నుంచి అజర్బైజన్ చేరుకొని కొన్ని నెలలపాటు అక్కడే ఉన్నాడు.






