NATO :పాక్ కు ప్రధాన నాటోయేతర సభ్యదేశ హోదా తొలగించాలి
పాకిస్థాన్‌కు ప్రధాన నాటోయేతర సభ్య దేశ హోదాను తొలగించాలని అమెరికా ప్రతినిధుల సభలో మరోసారి బిల్లును ప్రవేశపెట్టారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ్యుడు ఆండీ బిగ్స్ (Andy Biggs) దీన్ని పున ప్రతిపాదించారు. ప్రతినిధుల సభకు చెందిన జుడిసియరీ కమిటీ పర్యవేక్షణలోని నేరాలు, సమాఖ్య ప్రభుత్వ నిఘా ఉప కమిటీకి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తు న్నారు. తమ భూభాగంలో మిలిటెంట్ సంస్థ హక్కానీ నెట్వర్క్ కార్యకలాపాలను నియంత్రించేందుకు పాక్ (Pakistan)సైనిక చర్యలు చేపట్టేవరకూ ఆ దేశానికి ప్రధాన నాటో యేతర సభ్యదేశ హోదాను తొలగించాలని అని బిల్లులో పేర్కొన్నారు. 2019 నుంచి వరుసగా ఆండీ బిగ్స్ ఈ బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెడుతున్నా ఆమోద తెలిపే ప్రక్రియపై ముందడుగు పడలేదు.






