Bill Gates :బిల్గేట్స్ మరో విప్లవాత్మక నిర్ణయం
మైక్రోసాఫ్ట్ (Microsoft )వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ (Bill Gates) మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. తన సంపదలో 99 శాతాన్ని గేట్స్ ఫౌండేషన్ (Gates Foundation )కు దానం చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ సంపదతో గేట్స్ ఫౌండేషన్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలను భారీ స్థాయిలో చేపట్టనున్నారు. 2045 నాటికి ఆ సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసి గేట్స్ ఫౌండేషన్ను పూర్తిగా మూసేయ్యాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం లెక్కల ప్రకారం బిల్గేట్స్ సంపదలో 99 శాతం అంటే 107 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీ (Indian currency) ప్రకారం 9 లక్షల కోట్ల రూపాయలు.







