Usha Vance :గూగుల్‌లో ఉషా వాన్స్‌ను తెగ వెతికిన అమెరికన్లు

అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ తన ఆహార్యంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(J.D. Vance) సతీమణి, తెలుగింటి ఆడపడుచు ఉషా వాన్స్ (Usha Vance). దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు అమెరికన్లు(Americans) పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె మతం, పౌరసత్వం వంటి వ్యక్తిగత సమాచారం కోసం గూగుల్ (Google)లో తెగ వెతికారు.