Mukesh Ambani : డొనాల్డ్ ట్రంప్‌తో అంబానీ సమావేశం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ను కలిసేందుకు ఆసియా కుబేరుడైన ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దోహా (Doha)కు బయలుదేరారు. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన్ని అంబానీ కలవడం ఇది రెండోసారి అవుతుంది. ట్రంప్ కోసం ఎమిర్ ఆఫ్ ఖతార్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ విందుకు అంబానీ కూడా హాజరుకానున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) వివాహానికి ట్రంప్ కుమార్తె ఇవాంకా (Ivanka), అల్లుడు జరేద్ ఖుష్నర్ హాజరు కాగా, ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో 100 మందికి ఇచ్చిన ప్రత్యేక విందులో నీతా `ముకేశ్ అంబానీ పాల్గొన్న సంగతి తెలిసిందే.







