KKR: చీప్ గా కెప్టెన్ ను కొనుక్కున్న కేకేఆర్… వ్యూహం అంటే ఇది
వచ్చే ఏడాది ఐపిఎల్ కోసం కెప్టెన్ల ఎంపిక ఇప్పుడు కీలక టీంలకు ప్రధాన సమస్యగా మారింది. ప్రముఖ ఆటగాళ్లను కొనుక్కున్న జట్లు ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నాయి. ఆర్సీబీ, ఢిల్లీ, లక్నో, పంజాబ్, కేకేఆర్ జట్లు ఎవరిని కెప్టెన్ గా నియమిస్తాయి అనే దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా కేకేఆర్ వేసిన అడుగులు మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేస్తున్నాయి. గత ఏడాది కప్ అందించిన శ్రేయాస్ అయ్యర్ ను (Shreyas iyer) వదులుకున్న కేకేఆర్ (KKR)… ఈ ఏడాది వెంకటేష్ అయ్యర్ ను కెప్టెన్ గా ఎంపిక చేస్తుందని భావించారు.
అతని కోసం ఏకంగా 23 కోట్లు ఖర్చు పెట్టింది కేకేఆర్. అయితే అనూహ్యంగా సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానేకు (Ajinkya Rahane) కెప్తెన్సీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. 2008లో అరంగేట్రం చేసిన అతను కేకేఆర్ తో పాటుగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 185 మ్యాచ్ లు ఆడిన రహానే… 4,642 పరుగులతో, 123.42 స్ట్రైక్ రేట్‌తో, టోర్నీలో రెండు సెంచరీలు చేశాడు. 2018, 2019లో రాజస్థాన్ రాయల్స్ కు నాయకత్వం వహించాడు.
రెగ్యులర్ కెప్టెన్లు లేనప్పుడు జాతీయ జట్టును నడిపించిన అనుభవం కూడా ఉంది. 23.75 కోట్లకు కోల్‌కతా జట్టు కొనుగోలు చేసిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer) ను కొత్త కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది. కాని సీనియర్ ఆటగాడు రహానేను కేవలం 1.5 కోట్లకు కేకేఆర్ కెప్టెన్సీ పదవి కోసం కొనుగోలు చేసింది. మొదటి రౌండ్ లో అతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. ఈ టైం లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆ జట్టు యాజమాన్యం రహానేను బేస్ ప్రైస్ కు కొనేసింది. ప్రస్తుతం ముంబై రంజీ ట్రోఫీ సారథిగా ఉన్న అజింక్యా రహానే… సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ముంబైకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.






