Cuba :వారం కూడా తిరక్కుండానే.. ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు

క్యూబాను తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలోకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) మళ్లీ చేర్చారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే పరిస్థితి తారుమారైంది. ఒక వారం క్రితం క్యూబాను ఈ జాబితా నుంచి తొలగిస్తూ ఎన్నాళ్ళుగానో అందరూ ఎదురుచూస్తున్న నిర్ణయాన్ని మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తీసుకున్నారు. కానీ ట్రంప్ పగ్గాలు చేపట్టగానే మళ్ళీ ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు. క్యూబా(Cuba) పై పలు రకాలుగా ఏకపక్ష ఆంక్షలు విధించడంతో ఒక రకంగా అంతర్జాతీయ వాణిజ్య పరిధి నుండి ఆ దేశం బయటకు వచ్చేసింది. ఈ కారణంగా ఇంధనం వంటి కీలక ఉత్పత్తుల కొరత చాలా తీవ్రంగా వుంటోంది. ఆంక్షలు సహా ఇటువంటి చర్యలతో క్యూబా అనేక మానవతా సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ట్రంప్ తీసుకున్న చర్యను క్యూబా అధ్యక్షుడు డియాజ్ కానెల్(Diaz Canel) తీవ్రంగా విమర్శించారు.