Russia : రష్యాలో మరో కొత్త వైరస్ ?
రష్యా (Russia)లో అంతుచిక్కని వైరస్ (Virus) విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరం (Fever) తో బాధపడుతున్నారని తెలిపాయి. దగ్గుతున్నప్పుడు వైరస్ కారణంగా రక్తం పడుతోందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. రష్యాలోని పలు నగరాల్లో ప్రజల వారాల తరబడి జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని, ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొవిడ్ పరీక్షలు (Covid tests) చేసినప్పుడు నెగిటివ్ (Negative) వచ్చినందును ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ నివేదికలు అన్నింటినీ రష్యన్ అధికారులు ఖండిరచారు. తాము జరుపుతున్న పరీక్షల్లో ఎలాంటి కొత్త వ్యాధి కారకాలు బయటపడలేదని వెల్లడిరచారు.






