Vladimir Putin: పుతిన్ కీలక నిర్ణయం … 30 గంటల పాటు
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈస్టర్ (Easter) పండుగ సందర్భంగా 30 గంటల పాటు కాల్పులను తాత్కాలికంగా ఆపాలని ఆదేశించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం అర్థరాత్రి వరకు ఈ తాత్కాలిక యుద్ధ విరామం అమలులో ఉంటుందని పుతిన్ వెల్లడిరచారు. ఈ ప్రకటనను ఆయన రష్యా సైనిక ప్రధానాధికారి వాలెరీ గెరాసి మోవ్ (Valery Gerasimov)తో జరిగిన సమావేశం తర్వాత ప్రకటించారు. గతంలో కూడా క్రిస్మస్ (Christmas) పర్వదినం సందర్భంగా రష్యా తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత విరామ సమయంలో అన్ని రకాల యుద్ధ చర్యలు నిలిపివేయాలని సూచించారు. ఉక్రెయిన్ (Ukraine) కూడా ఇదే విధంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు పుతిన్ తెలిపారు. అయితే ఇదే సమయంలో అదనుగా శత్రువులు ఎలాంటి దాడి చేసినా లేదా ఉల్లంఘనలకు పాల్పడినా సైన్యం అప్రమత్తంగా ఉండాలని పుతిన్ సూచించారు.







