షికాగోలో కాల్పులు
అమెరికాలోని షికాగో సమీపంలో గ్రాండ్ క్రాసింగ్ వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడిరచారు. ఇది వ్యక్తిగత లక్ష్యంతో జరిగిన దాడిగా పేర్కొన్నారు. సాయుధులు ఆ మహిళలు నివసిస్తున్న ఇంటిపై కాల్పులు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో 5.. 7 ఏళ్ల వయసు గల ఎడ్వర్డ్స్ పిల్లలు ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఏడాది వయసున్న చిన్నారిని ఆమె చుట్టుకొని కాపాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పిల్లలకు సోదరుడి వరసైన మరో బాలుడు (8) కూడా తీవ్రంగా గాయపడ్డాడు.






