అనుకూలంగా ఐరాసలో 143 దేశాల తీర్మానం.. వ్యతిరేకించిన అమెరికా, ఇజ్రాయెల్
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అనుకూలంగా 143 దేశాలు ఓటేశాయి. అమెరికా, ఇజ్రాయల్ సహా 9 దేశాలు వ్యతిరేకించాయి. 25 దేశాలు గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానంతో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం లభించదు. సభ్యత్వానికి అర్హత సాధించినట్లు గుర్తింపు మాత్రమే లభిస్తుంది. ఈ తీర్మానాన్ని సర్వప్రతినిధి సభ ఐక్యరాజ్యసమితి భద్రత మండలికి పంపుతుంది. అక్కడ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. తమకు పూర్తి స్థాయి సభ్యత్వం కావాలంటూ ఏప్రిల్లో కూడా ఐరాస భద్రతా మండలిని పాలస్తీనా అథారిటీ కోరింది. అయితే ఈ తీర్మానానికి 12 సభ్యదేశాలు ఆమోదం తెలిపినా, అమెరికా వీటో చేసింది.






