భారత సంతతి బాలుడికి అరుదైన గుర్తింపు.. బ్రిటన్ ప్రధాని నుంచి

బ్రిటన్‍లో భారత సంతతికి చెందిన 11 ఏళ్ల బాలుడికి అరుదైన గుర్తింపు లభించింది. కరోనా లాక్‍డౌన్ వేళ 14 దేశాల్లోని 40 మంది చిన్నారులకు ఉచితంగా ఆన్‍లైన్ తరగతులు నిర్వహించినందుకుగానూ బ్రిటన్ ప్రధాని నుంచి అతడికి పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు అందింది. కెంట్‍లోని సెవన్‍ఓక్స్ ప్రాంతానికి చెందిన ఈశ్వర్ శర్మ ఆటిజం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్‍యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‍డీ) లతో బాధపడుతున్నాడు. తండ్రి ప్రతిరోజు యోగా చేస్తుండటం చూసి అతడు కూడా దానివైపు ఆకర్షితుడై నేర్చుకున్నాడు. తనలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న చిన్నారుల కోసం ఈశ్వర్ చాలా కాలం క్రితమే వర్చువల్ విధానంలో ఉచిత యోగా తరగతులు ప్రారంభించాడు. కరోనా లాక్‍డౌన్ వేళ వాటితో మరింత ఆదరణ పొందాడు. అతడి సేవలకు గుర్తింపుగా.. బ్రిటన్ ప్రధాని రోజువారీ అందించే పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు తాజాగా వరించింది.