కరోనా రికవరీకి ఆయుర్వేదం
కరోనా చికిత్సలో ఆయుర్వేద ఔషధాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ) వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు ఇన్పెక్షన్తో బాధపడుతున్న కొవిడ్ రోగికి ఆయుష్ క్వాథా, సంశమని వాటి, ఫిపాట్రాల్ మాత్రలతో పాటు లక్ష్మీవిలాస రసను అందించగా ఆరు రోజుల్లోనే వారికి నెగెటివ్ వచ్చిందని తెలిపింది. ఆ నాలుగు ఆయుర్వేద మందుల వల్లే.. అతి స్వల్ప వ్యవధిలో కరోనా నుంచి రోగి కోలుకోగలిగారని పేర్కొంది. కొవిడ్ బారినపడిన ఢిల్లీలోని ఓ 30 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు సంశమన థెరపీ లో భాగంగా ఆయుర్వేద ఔషధాలు అందించగా ఈ మేరకు సానుకూల ఫలితాలు వచ్చాయని ఏఐఐఏ వివరించింది. ఆయుష్ క్వాథా అనేది తులసి, దాల్చిని, సొంటి, మిరియాల మిశ్రమంతో రూపొందిన టాబ్లెట్.






