MATA: మాటా ఆధ్వర్యంలో ప్రతివారం ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్

ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి నెలా ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) న్యూజెర్సీ ప్రకటించింది. ఈ కార్యక్రమం ప్రతి నెల మొదటి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓక్ ట్రీ రోడ్‌లోని ఎడిసన్ వద్ద ఉన్న సాయి దత్త పీఠం & కల్చరల్ సెంటర్‌లో జరగనున్నట్లు మాటా తెలిపింది. ఈ ఉచిత శిబిరాల్లో (Free Health Screening Center) పలు రకాల వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఇందులో ప్రైమరీ కేర్ వైద్యులు, స్పెషలిస్ట్‌ల ద్వారా సాధారణ ఆరోగ్య పరీక్షలు, ఎస్ఎస్ఏఐ (SSAI) సౌజన్యంతో కంటి పరీక్షలు నిర్వహిస్తారు. దీంతో పాటు ఫిజియోథెరపీ & రిహాబిలిటేషన్ సపోర్ట్, ఉచిత మందులు, ఇతర స్క్రీనింగ్‌లను కూడా అందిస్తారు. ఈ కార్యక్రమానికి బటర్‌ఫ్లై ఫార్మసీ మద్దతు ఇస్తున్నట్లు మాటా (MATA) వెల్లడించింది.
ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రోగ్రామ్ ఆర్గనైజర్లుగా డా. సరస్వతి లక్కసాని, కల్యాణి బెల్లంకొండ, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్లుగా పురుషోత్తం అనిమేల, ప్రసూన కనకపల్లి, శ్రీజ నందకుమార్, లక్ష్మీ పసుమర్తి, శ్యామల కజన సేవ చేస్తున్నట్లు మాటా (MATA) తెలిపింది. డా. రాజ్ కటార, డా. శాంతి ఎప్పనపల్లి, డా. సంధ్య చిన్నల, డా. వేదవాని తిరువేదుల, డా. నిథాశ రాజ్, రఘుశర్మ శంకరమంచి, దాము గాదెల తదితరులు సహకారం అందిస్తున్నారు. యూత్ ఆర్గనైజర్లుగా ధ్రువన్ రెడ్డి, దేవన లక్కసాని సేవలందిస్తున్నారు.