TFAS: న్యూజెర్సీలో అంగరంగ వైభవంగా ‘దీపావళి జాతర’

అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కళా సమితి (TFAS) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ‘దీపావళి జాతర’ (Deepavali Jathara) కార్యక్రమం జరిగింది. 200 మందికిపైగా కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొని తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. వెయ్యి మందికిపైగా స్థానిక తెలుగు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. అంతరించిపోతున్న కళారూపాలను గుర్తుచేస్తూ నిర్వహించిన ఈ (Deepavali Jathara) వేడుకలు అందర్నీ అలరించాయి. హరికథ, బుర్రకథ వంటి కార్యక్రమాలు ఆకట్టుుకున్నాయి. ప్రముఖ కళాకారులు, సింగర్స్ తమ ఆటపాటలతో అందరిలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా కళలకు ఎంతో సేవ చేసిన సీనియర్ కళాకారులను సత్కరించారు. ఓక్ ట్రీ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమం అందరినీ అలరించగా.. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన అందరికీ టీఎఫ్ఏఎస్ (TFAS) ధన్యవాదాలు తెలియజేసింది.