The Raja Saab: రాజా సాబ్ రన్ టైమ్ ఎంతంటే?
ప్రభాస్(prabhas) హీరోగా మారుతి(maruthi) దర్శకత్వంలో వస్తున్న సినిమా ది రాజా సాబ్(the raja saab). హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People media factory) భారీ బడ్జెట్ తో నిర్మించగా, ఈ మూవీలో నిధి అగర్వాల్(Niddhi agerwal), మాళవిక మోహనన్(malavika mohanan), రిద్ధి కుమార్(Riddhi kumar) హీరోయిన్లు గా నటిస్తున్నారు. సంజయ్ దత్(Sanjay Dutt) కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు తమన్(thaman) సంగీతం అందించిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి కానుకగా జనవరి 9న రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన కంటెంట్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ వైపు ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తూనే, మరోవైపు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తాజాగా సెన్సార్ కు వెళ్లిన రాజాసాబ్ యూఏ సర్టిఫికెట్ ను అందుకుంది.
సెన్సార్ బోర్డు సినిమాలోని ఓ సీన్ ను కట్ చేశారని తెలుస్తోంది. ఇక మూవీ రన్ టైమ్ విషయానికొస్తే రాజా సాబ్ 3 గంటల 9 నిమిషాల రన్ టైమ్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ మధ్య పెద్ద సినిమాలకు 3 గంటల రన్ టైమ్ అనేది చాలా సహజంగా మారింది. మరి ఈ రన్ టైమ్ తో పండగ సీజన్ లో ముందుగా రిలీజవుతున్న రాజా సాబ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.






