Nari Nari Naduma Murari: ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’ రిలీజ్
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయు, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు.
చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్స్ ని ప్రారంభించింది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘భల్లే భల్లే’ విడుదలైంది. ఇది యంగ్ లవ్ లోని హ్యాపీనెస్ ని ప్రజెంట్ చేస్తోంది. హరిచరణ్ పాడిన, రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట విన్న వెంటనే ఆకట్టుకుంటుంది.
శర్వా, సాక్షి పాత్రల మధ్య వుండే కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ఒక విజువల్ ట్రీట్ లా వుంది. కేరళలోని పచ్చని ప్రకృతి సౌందర్యం నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాటలోని ఫ్రేమ్‌లు, జంట మధ్య వికసిస్తున్న ప్రేమ అద్భుతంగా చూపించాయి. ప్రతి ఫ్రేమ్ ఈ పాటకు పండుగ వాతావరణాన్ని, చూడముచ్చటైన అనుభూతిని అందిస్తాయి. అద్భుతమైన దృశ్యాలు, కూల్ మ్యూజిక్, లవ్లీ పెర్ఫార్మెన్స్ లతో ‘భల్లే భల్లే’ పాటను ఒక మరపురాని మ్యూజికల్ మూమెంట్ గా నిలిపాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ గా హిట్ అయ్యింది.
ఈ చిత్రంలో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ఒక ప్రత్యేక పాత్రలో నటించగా, సత్య, సునీల్, సుదర్శన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
సినిమాటోగ్రఫీని జ్ఞానశేఖర్ విఎస్, యువరాజ్ నిర్వహించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగన సంభాషణలు రాశారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాతగా, కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.






