TAGB: అంగరంగ వైభవంగా టీఏజీబీ ‘దసరా-దీపావళి ధమాకా’

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (TAGB) ఆధ్వర్యంలో అక్టోబర్ 11న లిటిల్ టన్ హైస్కూల్లో ‘దసరా-దీపావళి ధమాకా’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బోస్టన్ భారతీయ కౌన్సిల్ జనరల్ ఎస్.రఘురాంకు టీఏజీబీ (TAGB)ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. అనంతరం ఆయనతో ప్రశ్నోత్తర కార్యక్రమం కూడా నిర్వహించారు. తెలుగువారు అయిన ఎస్.రఘురాం గారిని సత్కరించడం తమకు ఎంతో గర్వంగా ఉందని టీఏజీబీ (TAGB)తెలిపింది.
ప్రెసిడెంట్ ఎలెక్ట్ సుధా ముల్పూర్, కార్యదర్శి దీప్తి కొరిపల్లి, కొశాధికారి జగదీష్ చిన్నం, కల్చరల్ సెక్రటరి సూర్యా తెలప్రోలుతో కూడిన కార్యనిర్వాహక వర్గం, ట్రస్టీస్ ఛైర్ శ్రీ రవి అంకినీడు చౌదరి సారధ్యంలోని ట్రస్టీస్ బృందం అద్భుతమైన సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని టీఏజీబీ (TAGB)అధ్యక్షులు శ్రీనివాస్ గొంది కొనియాడారు. మానవతా దృక్పథంతో సమాజంలో విశేష సేవలందిస్తున్న ప్రముఖులను ఈ వేదికపై సన్మానించుకోవడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆయన అన్నారు.
విదేశాల్లో సమస్యల్లో ఉన్న వారికి సహాయపడే ‘టీమ్ ఎయిడ్’ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ మోహన్ నన్నపనేని గారిని సత్కరించడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్న శ్రీనివాస్ గొంది.. ఆయన అసాధారణ మానవతా సేవకు టీఏజీబీ (TAGB) తరఫున అభినందనలు తెలియజేశారు. అలాగే సమాజ సేవ, విద్యార్థులను దత్తత తీసుకోవడం, యువతకు సహాయసహకారాలు అందించడం, బ్యాక్-టు-స్కూల్ డ్రైవ్లు వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన శ్రీ రమేష్ బాపనపల్లి గారిని కూడా టీఏజీబీ (TAGB) సన్మానించింది.
ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విందు భోజనం అందరినీ విపరీతంగా ఆకర్షించింది. ఈ ధమాకాలో మొత్తం 460 మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. పిల్లల పౌరాణిక పాత్రల వేషధారణ ఈ కార్యక్రమంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని టీఏజీబీ (TAGB) ప్రెసిడెంట్ శ్రీనివాస్ తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటల ప్రదర్శనలతో అందరినీ ఉర్రూతలూగించాయన్నారు.
ప్రముఖ సింగర్స్ మనీష ఎర్రబత్తిన, అదితి భావరాజు, పృధ్వి చంద్రలు ‘డైనమైట్ మ్యూజికల్ ప్రోగ్రాం’తో ఈ వేడుకలు విచ్చేసిన అందరినీ అలరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంల్ టీఏజీబీ (TAGB) కార్యనిర్వాహక వర్గం, ట్రస్టీస్, వాలంటీర్ల సహకారం ఎంతో ఉందని శ్రీనివాస్ గొంది చెప్పారు.
ఈ వేడుకలు విజయవంతం చేయడంలో కృషి చేసిన టీఏజీబీ (TAGB) 2025-26 గవర్నింగ్ బోర్డ్ సభ్యులు ప్రెసిడెంట్ శ్రీనివాస్ గొంది, ,ప్రెసిడెంట్ ఎలెక్ట్ సుధ ముల్పూర్, కార్యదర్శి దీప్తి కొరిపల్లి, ట్రెజరర్ జగదీష్ చిన్నం, కల్చరల్ సెక్రటరీ సూర్యా తెలప్రోలు, ఛైర్మన్ అంకినీడు చౌదరి రావి, వైస్-ఛైర్మన్ కాళీదాస్ సురపనేని, సభ్యులు శేషగిరి రెడ్డి, పద్మావతి భీమన, ఎక్స్-అఫిషియో దీప్తీ గోరా అందరికీ టీఏజీబీ (TAGB) ధన్యవాదాలు తెలియజేసింది.