Bay Area: బే ఏరియాలో ఘనంగా జరిగిన ఎఐఎ దసరా దీపావళి ధమాకా

బే ఏరియా (Bay Area) లోని ఎన్నారైలు దసరా దీపావళి వేడుకలను అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకలు సిలికాన్ వ్యాలీలో రికార్డు సృష్టించేలా సాగింది. దాదాపు 25,000 మందికి పైగా హాజరుతో ఘనంగా వేడుకల సంబరాలు ఆకాశాన్ని అంటేలా సాగాయి. బే ఏరియా అంతా కాంతి, సంస్కృతి, సామాజిక స్ఫూర్తి కలయికతో మెరిసిపోయింది. దసరా దీపావళి ధమాకా 2025 వేడుక ప్లెసంటన్‌లోని అలమెడ కౌంటీ ఫెయిర్‌గ్రౌండ్స్‌ను దీపకాంతులతో వెలిగించింది. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA), బాలీ 92.3 ఎఫ్ ఎం సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుక దేశంలోనే అత్యంత పెద్ద, అత్యంత ఉల్లాసభరితమైన దీపావళి ఉత్సవాలలో ఒకటిగా నిలిచింది. పి అండ్ జి (ప్రాక్టర్ అండ్ గాంబిల్) ఈ వేడుకకు ముఖ్య స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేడుకలు జరిగాయి. వేడుకలు జరిగిన ఫెయిర్‌గ్రౌండ్స్ భక్తి, రంగులు మరియు ఉత్సవ వాతావరణంతో కనిపించింది. శాంతి, శ్రేయస్సు కోసం ఆశీస్సులు కోరుతూ పవిత్రమైన మహా మంగళ హారతితో వేడుకలను ప్రారంభించారు. ఆ తర్వాత అద్భుతమైన ‘‘దుర్గా మాత’’ రథయాత్ర జరిగింది, ఇది మైదానమంతా సాగి, భక్తి పాటలు, సంగీతం, రంగుల సాంస్కృతిక ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. రామాయణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన రామ్ లీలా ప్రదర్శన కూడా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.
ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న 40 అడుగుల ఎత్తైన, కళాత్మకంగా తీర్చిదిద్దిన రావణాసురుడి దిష్టిబొమ్మ రాత్రిపూట ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది ఎదురుచూస్తుండగా, దిష్టిబొమ్మను దహనం చేయగా, అది ఆకాశంలో అగ్ని కీలలతో అద్భుతంగా వెలిగింది. ఈ రావణ దహనం యొక్క భావోద్వేగ శక్తి పండుగ ముగింపు కార్యక్రమం – బాణాసంచా కాల్చడంతో ముగిసింది. కళ్లు చెదిరే బాణాసంచా ప్రదర్శన వర్ణించనలవి కానిది. బాణాసంచాతో ఆకాశం ప్రకాశవంతమైన రంగుల మతాబులతో కనువిందు చేసింది. దీపావళి యొక్క అసలైన సారమైన, చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని చిహ్నంగా ఆ కాంతులు వేలాది కుటుంబాలు, పిల్లలు, స్నేహితుల ముఖాలను ప్రకాశింపజేశాయి. దాదాపు 500 మందికి పైగా ప్రతిభావంతులైన కళాకారులు ఇండోర్ మరియు అవుట్‌డోర్ వేదికలపై ప్రదర్శనలిచ్చారు, భారతదేశ సంస్కృతీ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ శాస్త్రీయ, జానపద, బాలీవుడ్, ఫ్యూజన్ ప్రదర్శనలను అందించారు. ఎఐఎ ఐడల్ సింగింగ్ కాంటెస్ట్, బాలీ తంబోలా విజయాన్ని సాధించి, ప్రేక్షకులకు ఇష్టమైనవిగా నిలిచాయి. 135 కంటే ఎక్కువ విక్రయశాలలు 20కి పైగా ఆహార స్టాల్స్‌తో ఫెయిర్‌గ్రౌండ్స్ అంతా సందడిగా కనిపించింది. ఇక్కడ నోరూరించే భారతీయ వంటకాలు, పండుగ స్వీట్లు, సాంప్రదాయ దుస్తులు, ఆభరణాలు, హస్తకళలు, దీపావళి అలంకరణ వస్తువులు, ఆర్థిక, పన్ను, విద్యాపరమైన సేవలు అందించారు. వేలాది మంది కలిసి పండుగ దీపాల క్రింద నృత్యం చేస్తూ, దీపావళి స్ఫూర్తిని, ఐక్యతను చాటుతూ గర్బా మరియు దాండియాతో ఆనందోత్సాహాలతో రాత్రి వరకు ఉత్సాహంగా కనిపించారు.
ఈ సంవత్సరం వేడుక చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకుంది, ఎందుకంటే 2026 నుండి కాలిఫోర్నియా దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవుదినంగా గుర్తించిన తర్వాత ఇది జరిగింది. ఇది ఇండియన్ అమెరికన్ సమాజానికి ఒక మైలురాయి. ఈ కార్యక్రమానికి గౌరవనీయ ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు, ఇది కాలిఫోర్నియాలో భారతీయ వలసదారుల పెరుగుతున్న సాంస్కృతిక, పౌర ప్రభావాన్ని ప్రతిబింబించింది.
ఈ వేడుకలకు రాబ్ బొంటా, కాలిఫోర్నియా రాష్ట్ర అటార్నీ జనరల్, డా. శ్రీకర్ రెడ్డి, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో, రాకేష్ అడ్లఖా, డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో, డేవిడ్ హూబర్ట్, అలమెడ కౌంటీ సూపర్వైజర్, జాక్ బాల్చ్, ప్లెసంటన్ మేయర్, రాజ్ సల్వాన్, ఫ్రీమాంట్ మేయర్, షెర్రీ హు, డబ్లిన్ మేయర్, మార్క్ ఆర్మ్‌స్ట్రాంగ్, శాన్ రామోన్ మేయర్, కార్మెన్ మొంటానో, మిల్పిటాస్ మేయర్, శ్రీధర్ వెరోస్, శాన్ రామోన్ వైస్ మేయర్, జీన్ జోసీ, కౌన్సిల్‌మెంబర్, డబ్లిన్, ఎవాన్ బ్రానింగ్, కౌన్సిల్‌మెంబర్, లివర్‌మోర్, రిను నాయర్, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ అజయ్ భూటోరియా, ఇండో-అమెరికన్ రాజకీయ నాయకుడు, లెఫ్టినెంట్ మైఖేల్ బక్‌హౌట్, షెరీఫ్ కార్యాలయం, అలమెడ కౌంటీ, కెప్టెన్ కర్ట్ ష్లేహూబర్, ప్లెసంటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తదితరుల ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా వేడుకలకు స్పాన్సర్లుగా వ్యవహరించిన వారందరికీ ఎఐఎ బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది: అలమెడ కౌంటీ సూపర్వైజర్ డేవిడ్ హూబర్ట్, సంజీవ్ గుప్తా సిపిఎ (బాణాసంచా స్పాన్సర్), డాక్టర్ ప్రకాష్ అండ్ రోహిత్ అడ్వానీ (రావణ దహనం), రియల్టర్ లావణ్య దువ్వీ, ట్రావెలోపాడ్, రియల్టర్ నాగరాజ్ అన్నయ్య. ఇతర స్పాన్సర్‌లలో హెల్పర్ జీనీ, ఎర్త్ క్లెన్జ్, వాచి సిల్క్స్, ఇన్‌స్టా సర్వీస్, ఆజాద్ ఫైనాన్షియల్స్, మై పర్సు, ఐసీఐసిఐ బ్యాంక్, కీస్టోన్ ఉత్సవ్, తనిష్క్ జ్యువెలర్స్, దీక్ష, శ్రీశివ సాయి గ్రోసరీ, కోరల్ అకాడమీ ఉన్నాయి. ఈ భారీ వేడుకను సాధ్యం చేసిన ప్రదర్శనకారులు, విక్రేతలు మరియు 150 మందికి పైగా వాలంటీర్లకు ఎఐఎ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.