BATA: అహో అనిపించిన బాటా ‘‘దీపావళి’’ సంబరాలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) ‘‘దీపావళి’’ పండుగను కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఇది బాటా నిర్వహించే ముఖ్య కార్యక్రమాల్లో దీపావళి ఒకటి. బే ఏరియాలోని తెలుగు కమ్యూనిటీలో ఎంతో ప్రాచుర్యం పొందిన వేడుక కూడా. ఈ కార్యక్రమానికి స్థానిక కమ్యూనిటీ నుండి అద్భుతమైన మద్దతు లభించింది. కార్యక్రమం మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమై రాత్రి 10:00 గంటల వరకు కొనసాగింది. లెజెండరీ మృదంగ విద్వాంసులు పద్మశ్రీ డా. యల్లా వెంకటేశ్వర రావు గారి కచేరీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
ఈ కార్యక్రమానికి ‘‘సంజీవ్ గుప్తా సిపిఎ గ్రాండ్ స్పాన్సర్‌గా వ్యవహరించారు. రియల్టర్ ‘‘నాగరాజ్ అన్నయ్య’’ ఈవెంట్‌ను పవర్ చేసారు. గోల్డ్ స్పాన్సర్ గా శ్రీని గోలి రియల్ ఎస్టేట్స్, సిల్వర్ స్పాన్సర్‌లుగా పిఎన్ జి జ్యువెలర్స్, ఇన్‌స్టా సర్వీస్, రియల్టర్ షికా కపూర్ అండ్ ఆస్పోరా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ‘‘పాఠశాల’’ విరిజల్లు రేడియో మద్దతు ఇచ్చాయి. ఫుడ్ స్పాన్సర్ గా రాజా రాణి బేకరీ వారు వ్యవహరించారు. వెండర్ బూత్‌లలో దుస్తులు, ఆభరణాలు, రియల్ ఎస్టేట్, ఆర్థిక, విద్యా మరియు ఆరోగ్య సంరక్షణ సేవలను ఏర్పాటు చేశారు.
దీపావళి వేడుకలను కాన్సుల్ జనరల్ డా. శ్రీకర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ దృశ్యం న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిరది. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఐఎ) బృంద సభ్యులు హాజరై దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ కమ్యూనిటీ సంస్థల నాయకులు మరియు ఎన్నికైన అధికారులు బాటా బృందాన్ని అభినందించారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి, మన సంస్కృతి, వారసత్వం మరియు సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడంలో కృషి చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
బాటాకల్చరల్ టీమ్ సభ్యులు ఫ్రీమాంట్, శాన్ రామన్, డబ్లిన్, మిల్పిటాస్, శాన్ హోసే వంటి వివిధ ప్రాంతాలలో శిక్షణా తరగతులను నిర్వహించారు. 100 మందికి పైగా పిల్లలు మరియు యువత వివిధ నృత్యాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సహకరించిన పాల్గొన్న వారందరికీ బృందం ధన్యవాదాలు తెలిపింది.
పద్మశ్రీ డా. యల్లా వెంకటేశ్వర రావు గారు (80సంవత్సరాలు) తమ మృదంగ కచేరీతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ప్రేక్షకులు ఆయనకు స్టాండిరగ్ ఒవేషన్ ఇచ్చారు. బాటా కమిటీ ఆయనకు శాలువా కప్పి, ఘనంగా సన్మానించింది. బాటా అధ్యక్షులు శివ కాడ ఈ కార్యక్రమం గొప్ప విజయవంతం కావడానికి కష్టపడిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన బాటా టీమ్ ను అందరికీ పరిచయం చేశారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ: వరుణ్ ముక్కా, హరి సన్నిధి, సందీప్ కేదారశెట్టి, సంకేత్ కసుప.
స్టీరింగ్ కమిటీ: రవి తిరువీధులా, కామేష్ మల్లా, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి, కొండల్ కొమరగిరి.
కల్చరల్ కమిటీ: శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, శిరీష బత్తుల, తారక దీప్తి.
లాజిస్టిక్స్ టీమ్: సురేష్ శివపురం, రవి పోచిరాజు, హరీష్ ఇనాంపూడి, సుధాకర్.
యూత్ కమిటీ: ఉదయ్, గౌతమి, సింధు. ‘ఆర్ట్స్ అండ్ డిజైన్ కమిటీ’ కళ్యాణి, దీప్తి, కృష్ణ ప్రియ, శ్రావంతి.
బాటా ‘‘అడ్వైజరీ బోర్డ్’’ సభ్యులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరూ వుప్పాల, ప్రసాద్ మాగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరు, హరినాథ్ చికోటి ఈ కార్యక్రమం గొప్ప విజయం సాధించినందుకు బృందాన్ని అభినందించారు.