FHA Rules: హెచ్ 1 బీ వీసాదారులకు రుణాలు ఇవ్వబోమంటున్న అమెరికా హోసింగ్ మార్కెట్

హెచ్ 1 బీ వీసాఫీజును పెంచిన ట్రంప్ సర్కార్.. ఇప్పుడు వారిపై మరో బండ పడేసింది. ఇప్పటివరకూ తక్కువ వేతనం, ఇతరత్రా దీర్ఘకాలిక ఉద్యోగం లేకున్నా, కొన్ని మినహాయింపులతో కూడిన రుణాలతో ఇల్లు కొనుగోలుకు … ఇతర దేశాల నుంచి వలసొచ్చినవారు ప్రయత్నించేవారు. దీనికి గానూ ఫెడరల్ హౌసింగ్ అడ్మినిస్ట్రేషన్.. ఇన్సూరెన్స్ తనఖా రుణంతో సహకరించేది. అయితే ట్రంప్ సర్కార్ నూతన నిబంధనలను అనుసరించి.. ఇకపై ఇలాంటి ఎఫ్ హెచ్ ఏ తనఖా రుణాలకు .. హెచ్ 1 బీ వీసాదారులు అర్హులు కారు.
ఎఫ్ హెచ్ ఏ తనఖా రుణమంటే..
FHA తనఖా అంటే ఫెడరల్ హౌసింగ్ అడ్మినిస్ట్రేషన్ (FHA) ద్వారా బీమా చేయబడిన తనఖా రుణం. ఇది సంప్రదాయ రుణ ప్రమాణాలకు అనుగుణంగా లేని, పరిమిత పొదుపు లేదా తక్కువ క్రెడిట్ చరిత్ర ఉన్న వ్యక్తులకు గృహ కొనుగోలును మరింత అందుబాటులోకి తీసుకురావడానికి రూపొందించబడింది. ఈ రుణాలు మొదటిసారి ఇల్లు కొనేవారికి, లేదా తక్కువ డౌన్ పేమెంట్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటాయి. ఈ రుణాలు FHA ద్వారా బీమా చేయబడతాయి, ఇది రుణదాతలకు రిస్క్ ను తగ్గిస్తుంది.ఇవి banks, credit unions, మరియు ఇతర FHA-ఆమోదిత రుణదాతల ద్వారా అందించబడతాయి.ఈ రుణాలను ప్రాథమిక నివాసాన్ని కొనుగోలు చేయడానికి, రీఫైనాన్స్ చేయడానికి, లేదా పునరుద్ధరించడానికి ఉపయోగించవచ్చు. సంప్రదాయ తనఖాలకు అర్హత లేనివారికి ఈ రుణాలు ఒక ఆచరణాత్మక పరిష్కారం.
H-1B వీసా హోల్డర్లు, స్థిరనివాసం లేని వారికి కొత్త FHA మార్ట్గేజ్ రుణాల సంఖ్య.. సున్నాస్థాయికి తగ్గిపోయింది. నిజానికి తన నిర్ణయాన్ని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (HUD) శాఖ .. మార్చి 26న వెల్లడించింది. శాశ్వత నివాసం లేని వ్యక్తులు.. మే 25 నుండి FHA-ఇన్సూర్డ్ మార్ట్గేజ్‌లకు అర్హులు కాదని తెలిపింది. ఈ నిర్ణయం డొనాల్డ్ ట్రంప్ యొక్క విధానాలకు అనుగుణంగా తీసుకున్నవని..కేవలం గ్రీన్ కార్డ్ హోల్డర్లకు మాత్రమే అందించగలమని స్పష్టం చేసింది.
జాన్ బర్న్స్ రీసెర్చ్ & కన్సల్టింగ్ (JBREC) నుండి కొత్త నివేదికకు అనుగుణంగా, శాశ్వత నివాసులు కాని వారికి (Non-Permanent Residents) జారీ చేసిన FHA రుణ పరిమాణం, ఏప్రిల్ లో 6 శాతం నుండి జూన్ లో 1 శాతానికి తగ్గిపోయింది. ఇక ]జూలై, ఆగస్టు నాటికి సున్నా కు చేరింది.“మే నెలలో జరిగిన నియమాల మార్పు తర్వాత NPRలకు కొత్త FHA రుణాలు సుమారు సున్నాకు చేరాయని తెలిపింది. NPRలు 2024లో FHA రుణాలలో సుమారు 4 శాతం మాత్రమే ఉండగా, ఫ్లోరిడా వంటి రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉందని సమాచారం. దీంతో ఇక అమెరికాలో ఇల్లు కొనాలంటే సంప్రదాయ రుణపద్ధతుల్ని ఆశ్రయించాల్సిఉంటుంది.
ఇప్పటికే చాలా మంది వీసా హోల్డర్లు.. ఈ రుణ షరతులను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూడా. మరోవైపు… ఇది అమెరికా హౌసింగ్ మార్కెట్ ను దెబ్బతీస్తుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అసలే బలహీనమైన అమ్మకాలు మరియు అధిక సరఫరాతో బాధపడుతున్న ముఖ్యమైన మార్కెట్లలో … రుణం దొరక్క చిన్నస్థాయిలో చాలా ఇళ్ల అమ్మకాలు నిలిచిపోతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.