TANTEX: నెల నెలా తెలుగు వెన్నెల 219 వ సాహిత్య సదస్సుకు ఆత్మీయ ఆహ్వానం

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రతి నెల సగౌరవంగా నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు కు మీ అందరికీ పునఃస్వాగతం.
ఎంతో మంది సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, కార్యకర్తలు, పోషక దాతలు ఇచ్చిన స్ఫూర్తితో మన భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా మొదలు పెట్టిన ఈ సాహిత్య సదస్సు, దిన దినాభివృద్ధి చెందుతూ, సాహిత్య శోభ ను వెదజల్లుతూ, భావితరానికి స్పూర్తిదాయకమై, నిరాటంకంగా కొనసాగుతుంది.
“నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు 219 వ మైలు రాయిని చేరుకున్న తరుణంలో, ఆదివారం అక్టోబర్ 29 న ‘తెలుగు వనంలో గజల్ పరిమళం ‘ మనతో పంచడానికి కొరుప్రోలు మాధవరావు గారు మరియు విజయలక్ష్మి కందిబండ గారూ రాబోతున్నారు. అలాగే తన మధుర గానంతో అలరించడానికి పాకలపాటి వేణు గోపాల కృష్ణంరాజు గారు కూడా సిద్ధంగా ఉన్నారు.
ఈ అపూర్వ కార్యక్రమానికి మీరు విచ్చేసి, సాహిత్యపు మాధుర్యాన్ని ఆస్వాదించి, చరిత్ర లో లిఖించదగిన అద్వితీయమైన ఘట్టం లో భాగం కావలసిందిగా కోరుతున్నాము.
తేదీ: ఆదివారం,అక్టోబర్ 19 , 2025 సమయం: మధ్యాహ్నం 2:30 నుండి 5:30
2681 MacArthur blvd, suite#204 Lewisville TX 75067
సాహిత్య సదస్సు జూమ్ లింక్ : https://bit.ly/3svKJbo
సమావేశం ఐడి: 788 250 6018 పాస్‌కోడ్ : 432781
దయాకర్ మాడ
తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త
పాలకమండలి ఉపాధిపతి
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం