ATA: ఆటా రీజనరల్ బిజినెస్ సమ్మిట్ సూపర్ సక్సెస్

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో అక్టోబర్ 9, శనివారం నాడు వాషింగ్టన్ డీసీలో ప్రాంతీయ బిజినెస్ సమ్మిట్ (Regional Business Summit) విజయవంతంగా జరిగింది. ఈ బిజినెస్ సమ్మిట్‌లో రియల్ ఎస్టేట్, విద్య (ఎడ్యుకేషన్), హాస్పిటాలిటీ, మహిళా సాధికారత (విమెన్ ఎంపవర్‌మెంట్), బిజినెస్ ఇన్నోవేషన్, ఏఐ (AI) ఆధారిత వాల్యూ క్రియేషన్ తదితర రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, నిపుణులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ (Regional Business Summit) సదస్సులో జరిగిన పలు ఆసక్తికర చర్చలు.. వ్యాపార అభివృద్ధికి సంబంధించిన విశ్లేషణలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
ఈ రీజనల్ సమ్మిట్‌లో 300 మందికి పైగా పాల్గొని ఎన్నో ఆలోచనలను రేకెత్తించే సెషన్‌లు విని స్ఫూర్తిపొందారు. ఈ వేడుకల్లో యూఎస్ కాంగ్రెస్ సభ్యులు సుహాస్ సుబ్రమణియం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో వృద్ధిని పెంచడంలో ఆటా (ATA) అంకితభావం, నిబద్ధతను ఆయన కొనియాడారు.