Mega158: మెగా158 లేటెస్ట్ అప్డేట్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ఇప్పుడు ఏడు పదుల వయసులో ఉన్నారు. ఈ వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ ఎంతో స్పీడుగా సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఆల్రెడీ విశ్వంభర(viswambhara) షూటింగ్ ను పూర్తి చేసిన చిరూ, ప్రస్తుతం అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు(Mana Sankaravaraprasad Garu) మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అనిల్ తో సినిమా తర్వాత చిరంజీవి బాబీ(Bobby)తో ఓ సినిమా, శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో మరో సినిమాను లైన్ లో పెట్టగా, వాటిలో ముందుగా బాబీ(Bobby) సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు చిరూ. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య(waltair veerayya) సూపర్‌హిట్ గా నిలవగా, ఇప్పుడు రానున్న సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
మెగాస్టార్ కెరీర్లో 158వ సినిమాగా రానున్న ఈ సినిమా నవంబర్ 5న పూజా కార్యక్రమాలతో మొదలు కానుందని, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ మూవీలో ఓ లీడ్ రోల్ కోసం మాళవిక మోహనన్(Malavika mohanan) తో మేకర్స్ డిస్కషన్స్ చేస్తున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్(prabhas) సరసన రాజా సాబ్(Raja saab) లో నటిస్తున్న మాళవిక, చిరూ(chiru)తో సినిమాకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.