ATA: వర్జీనియాలో ఆటా బిజినెస్ సెమినార్ సక్సెస్… 300 మందికి పైగా హాజరు

వర్జీనియాలో అక్టోబర్ 11వ తేదీన నిర్వహించిన అమెరికా తెలుగు సంఘం (ATA) బిజినెస్ సెమినార్ అపూర్వ విజయాన్ని సాధించింది. ఈ సెమినార్‌కి 300 మందికి పైగా ఉత్సాహవంతులైన వ్యాపార ఆశావహులు హాజరయ్యారు. ఆటా నాయకత్వం, అంకితభావం కలిగిన కమిటీల అసాధారణమైన కృషి, వ్యూహాత్మక ప్రణాళిక, సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ బిజినెస్ సమ్మిట్‌లో రియల్ ఎస్టేట్, విద్య, హాస్పిటాలిటీ, మహిళా సాధికారత, బిజినెస్ ఇన్నోవేషన్, ఏఐ ఆధారిత వాల్యూ క్రియేషన్ తదితర రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, నిపుణులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సదస్సులో జరిగిన పలు ఆసక్తికర చర్చలు.. వ్యాపార అభివృద్ధికి సంబంధించిన విశ్లేషణలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆటా అధ్యక్షుడు జయ్ చల్లా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల తోడ్పాటు, ముఖ్యంగా జయ్ చల్లా చొరవ, నిరంతర మార్గదర్శకత్వం ఎంతో కీలకంగా మారింది. ఈ రీజనల్ సమ్మిట్‌లో 300 మందికి పైగా పాల్గొని ఎన్నో ఆలోచనలను రేకెత్తించే సెషన్‌లు విని స్ఫూర్తిపొందారు. ఈ వేడుకల్లో యూఎస్ కాంగ్రెస్ సభ్యులు సుహాస్ సుబ్రమణియం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో వృద్ధిని పెంచడంలో ఆటా అంకితభావం, నిబద్ధతను ఆయన కొనియాడారు.
బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ వ్యాల్యూ క్రియేషన్ విత్ ఎఐ అన్నఅంశంపై జరిగిన చర్చల్లో పలువురు పాల్గొని మాట్లాడారు. యాక్సో ఎఐ మేనెజింగ్ డైరెక్టర్ సతీష్ తమ్మినేని, ఐబిఎం పార్టనర్ సందీప్ శిలావత్, వర్జీనియా టెక్ అజునెట్ ప్రొఫెసర్, టెక్నోమైల్ ఫౌండర్ శలక ఖోట్, కడ్మాస్ గ్రూపు ఎఐ ప్రాక్టీస్ లీడ్ రామ్ ప్రసాద్ పోలన వక్తలుగా పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ జిఎంయు డివిజనల్ డీన్ గుర్దీప్ సింగ్ ఈ కార్యక్రమానికి మోడరేటర్ గా వ్యవహరించారు.
ఫుడ్ హాస్పిటాలిటీ రిటైల్ ప్యానల్ డిస్కషన్‌లో మారియట్ హిల్టన్ గ్రూపునకు చెందిన షయ్యర్ హైడర్, 12 ఐహోప్స్ ఓనర్ ప్రవీణ్ కొండాక, రిటైల్, హాస్పిటాలిటీ ఓనర్ దీపక్ టక్కర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాజా ఆర్ హోల్డింగ్స్ కు చెందిన నవీన్ రంగ మోడరేటర్‌గా వ్యవహరించారు.
రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన చర్చల్లో డిఎస్‌పి రియల్ ఎస్టేట్ క్యాపిటల్ ఎల్ ఎల్ సి పార్టనర్, కో ఫౌండర్ స్టీపెన్ కార్బెల్క్, ఈస్ట్ ఎవెన్యూ ఇన్వెస్ట్‌మెంట్స్ మేనెజింగ్ పార్టనర్, సూరజ్ రెడ్డి, స్టీల్ హార్బర్ ఫౌండిరగ్ పార్టనర్ దీపక్ హతిరమణి స్పీకర్లుగా పాల్గొన్నారు. తారు టెక్నాలజీస్ కు చెందిన గ్రెగ్ డెర్బి మోడరేటర్‌గా వ్యవహరించారు.
ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్ ఎంపవర్ మెంట్ విభాగంలో జరిగిన చర్చల్లో ఆన్ లైన్ చాక్ సిఇఓ, ఫౌండర్ గరిమా రాయ్, బిజినెస్ ఇంటిగ్రా ఫౌండర్ అండ్ సిఇఓ ప్రతిభా రాందాస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఫర్ఫార్మెన్స్ మేనేజర్ ప్రసన్న నరసింహన్, క్యూరీ లెర్నింగ్ సిఇఓ, ఫౌండర్ వెంకట్‌రావు మూల్పూరి పాల్గొన్నారు. తారు టెక్నాలజీస్ కు చెందిన అనుపమ కటికనేని మోడరేటర్ గా వ్యవహరించారు.
ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడంలో తమ అలుపెరుగని కృషి, నిశితమైన ప్రణాళికతో కీలక పాత్ర పోషించిన సభ్యులు జీనత్ కుండూరు, నవీన్ రంగ, రవి చల్లా, శ్రీకాంత్ నడ్రిగ, రాజ్ శేఖర్, దేవ్ వొంటెల, వెంకట్ డోమ, కె.సి., కరుణాకర్ – రమేష్‌కు మా హృదయపూర్వక అభినందనలు. అలాగే, శ్రీధర్ నాగిరెడ్డి సహకారం ఈ కార్యక్రమానికి అదనపు విలువను, ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. శ్రీధర్ బానాల, విష్ణు మాధవరం, సుధీర్ బండారు, రామ్ మట్టపల్లి, శ్రీరామ్ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమానికి మద్దతు అందించారు. ముఖ్యంగా శ్రీధర్ సహకారం మా అంచనాలకు మించి ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఆర్ సి జీనత్ కుండూరు తన అలుపెరుగని శక్తి, సాటిలేని ఉత్సాహంతో, మరియు వైదేహి గారి డైనమిక్ యాంకరింగ్ ఈ కార్యక్రమానికి వన్నెతీసుకు వచ్చింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులకు, స్పీకర్లకు, మోడరేటర్లకు నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అధ్యక్షుడు-ఎలెక్ట్ సతీష్ రెడ్డికి ఆటా కమిటీ కో-చైర్లు, సలహాదారులు, డైరెక్టర్లు, మరియు సభ్యులందరికీుమీ అంకితభావం, సహకారం ఈ కార్యక్రమం ఎటువంటి లోపం లేకుండా, నిజంగా ఉల్లాసభరితమైన వాతావరణంలో జరిగేలా చేసిందని ఎంతోమంది ఔత్సాహికులకు ప్రోత్సాహకరంగా సెమినార్ సాగిందని ఆటా బిజినెస్ చైర్ హరీష్ బాతిని తెలిపారు.