Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీం ఆదేశించింది. అలాగే ప్రభాకర్ రావు కు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ పొడిగించిన న్యాయస్థానం, తదుపరి విచారణను నవంబర్ (November) 18కి వాయిదా వేసింది.