బర్లింగ్టన్ నగరం లో పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిచే SGS హనుమాన్ మందిర్ కుంభాభిషేక మహోత్సవం
పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు 2026వ సంవత్సరం మార్చి 31న అమెరికా దేశంలోని న్యూజెర్సీ రాష్ట్రంలో, బర్లింగ్టన్ నగరం లో ఉన్న SGS కార్య సిద్ధి హనుమాన్ మందిరానికి విచ్చేశారు.
ఈసందర్భంగా అక్కడి కార్యసిద్ధి హనుమాన్, గణేశ, అంబా, సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ, శివ విగ్రహా మూర్తుల ప్రతిష్ఠాపన మహోత్సవం మరియు కుంభాభిషేకము కార్యక్రమాలను సప్తాహంగా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించారు.
ప్రభాతకాలంలో పూజ్య శ్రీ స్వామిజీ వారు కుంభాభిషేక మహోత్సవానికి ఆశీర్వచనం అందించి, కొత్తగా నిర్మించిన ఆలయాన్ని దర్శించి, శ్రీ చక్ర పూజను నిర్వహించారు. అనంతరం సాయంత్రం స్వామిజీకి , ఘనమైన స్వాగత సభ ఏర్పాటు చేయబడింది.


ఈ సందర్భంగా ఆలయ సభ్యులు మరియు భక్తులు పూజ్య స్వామిజీ వారి ఆశీస్సులు, మార్గదర్శకత్వం వల్లనే ఈ దేవాలయ స్థాపన సాధ్యమైనదని తమ సంతోషాన్ని మరియు కృతజ్ఞతలను వ్యక్తపరిచారు. బర్లింగ్టన్ నగరంతో పాటు, న్యూ జెర్సీ రాష్ట్రానికి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై, స్వామిజీ వారికి తమ గౌరవ సూచక ప్రశంస పత్రాన్ని సమర్పించారు.
తదుపరి, పూజ్య స్వామిజీ వారు భక్తులకు ఆధ్యాత్మిక అనుగ్రహభాషణతో కూడిన ప్రసంగం చేసి, వారికి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ పవిత్ర కార్యక్రమం భక్తులందరికీ ఆధ్యాత్మిక ఆనందాన్ని, దైవానుగ్రహాన్ని ప్రసాదించింది.
ఇవి కూడా చదవండి






