క్వీన్స్‌ల్యాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 17న ఘనంగా ఉగాది వేడుకలు!
QTA: క్వీన్స్‌ల్యాండ్ తెలుగు అసోసియేషన్‘ (QTA) ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని తెలుగు వారి కోసం ‘ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రవాస తెలుగువారిని అలరించనున్నాయి.
ముఖ్య విశేషాలు..
సంగీత విభావరి..
ఈ సంబరాల్లో ప్రముఖ సినీ నేపథ్య గాయని అదితి భావరాజు ప్రత్యేక్ష సంగీత కచేరీ (Exclusive Music Concert) ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
వేదిక: ఈ వేడుకలు మే 17, ఆదివారం నాడు స్లాక్స్ క్రీక్ (Slacks Creek) లోని పారడైజ్ రోడ్లో గల ‘యూనిటీ హబ్’ (Unity Hub) వేదికగా జరగనున్నాయి.
సమయం: సాయంత్రం 05:00 గంటల నుండి రాత్రి 09:00 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
స్పాన్సర్షిప్ వివరాలు..
ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించాలనుకునే వారు గౌతమ్ (0414244039), హేమంత్ (0476 834 001) లేదా విద్య (0416 559 639)లను సంప్రదించవచ్చు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించ తలపెట్టిన ఈ ఉగాది వేడుకలకు తెలుగు వారందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని క్వీన్స్‌ల్యాండ్ తెలుగు అసోసియేషన్ కోరుతోంది.






