Varanasi: వారణాసి నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu), దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి(Rajamouli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి(Varanasi) ఇప్పటికే అంతర్జాతీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జార్జియాలో కీలక షెడ్యూల్ జరుగుతుండగా, ఈ ప్రాజెక్ట్ స్కేల్‌పై మరింత ఆసక్తి పెరుగుతోంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(priyanka chopra), మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithvi raj sukumaran) కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రకాష్ రాజ్(Prakash raj), ఆర్. మాధవన్(R. Madhavan) లాంటి అగ్ర నటులు కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగమవడం సినిమాకు మరింత బలం చేకూర్చుతోంది.

రీసెంట్ గా ప్రియాంక నటించిన హాలీవుడ్ సినిమా ది బ్లఫ్(The Bluff) చూసిన మహేష్ బాబు, ఆమె పెర్ఫార్మెన్స్పై ప్రశంసలు కురిపించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి స్పందించిన ప్రియాంక సీ యూ ఇన్ అంటార్కిటికా ఇచ్చిన రిప్లై ఇప్పుడు కొత్త ఊహాగానాలకు తావిస్తోంది. ఈ కామెంట్ ఆధారంగా వారణాసి నెక్ట్స్ షెడ్యూల్ అంటార్కిటికాలో జరగొచ్చని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాజమౌళి స్టైల్ యాక్షన్ అడ్వెంచర్‌కు ఐసీ ల్యాండ్‌స్కేప్స్ జతకావడం సినిమాను విజువల్‌గా మరింత గ్రాండ్‌గా నిలబెట్టనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
దుర్గా ఆర్ట్స్(Durga arts) బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ(KL Narayana) నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత కీరవాణి(keeravani) సంగీతం అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్(Vijayendra prasad) ఈ సినిమాకు కథను సమకూర్చగా, ప్రపంచ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను ఐమ్యాక్స్ అనుభూతిని అందించేలా తీర్చిదిద్దుతున్నారు. పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి

















