Shivaji: దండోరా అందుకే సరిగా పెర్ఫార్మ్ చేయలేదు
యాక్టర్ శివాజీ(Shivaji) ప్రధాన పాత్రలో రూపొందిన దండోరా(Dandora) సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సినిమా పరాజయంపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో శివాజీ స్పందిస్తూ పలు కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా రిలీజ్ డేట్ ఎంపికలో జరిగిన లోపమే సినిమాకు పెద్ద దెబ్బగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.
డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ముందుగా నిర్ణయించినప్పటికీ, సెన్సార్ ప్రక్రియలో జాప్యం కారణంగా అనిశ్చితి నెలకొన్నట్లు తెలిపారు. డిసెంబర్ 24 సాయంత్రం వరకు సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో థియేటర్ యజమానులు రిస్క్ తీసుకోలేకపోయారని, దీంతో సరైన సంఖ్యలో స్క్రీన్లు దక్కలేదని వివరించారు. రిలీజ్ టైమ్ తో పాటు సినిమా టైటిల్ కూడా ప్రభావం చూపిందని శివాజీ విశ్లేషించారు. దండోరా అనే పేరుతో ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేక భావజాలానికి సంబంధించిన సినిమా అన్న అభిప్రాయం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ అపోహలు తొలగించేందుకు టైటిల్ మార్పుపై తాను ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదని చెప్పారు. హైదరాబాద్ వంటి ప్రధాన కేంద్రాల్లో కూడా ప్రైమ్ టైమ్ షోలు లభించకపోవడం సినిమాపై ప్రభావం చూపిందని తెలిపారు. సాయంత్రం 4 గంటలు, రాత్రి 10 గంటల వంటి పరిమిత షోలకే పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు.అయితే తక్కువ స్క్రీన్లు, పరిమిత షోల మధ్య కూడా నైజాం ప్రాంతంలో కోటి రూపాయలకు పైగా వసూళ్లు సాధించడం చిత్ర బలాన్ని సూచిస్తుందని శివాజీ అన్నారు. సరైన రిలీజ్ ప్లానింగ్, స్క్రీన్లు బాగా లభించి ఉంటే సినిమా భారీ విజయాన్ని నమోదు చేసేదని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. కంటెంట్ పరంగా మెప్పించిన దండోరా సాంకేతిక, పంపిణీ లోపాల కారణంగా మాత్రమే వెనుకబడిందని శివాజీ తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి

















