Dragon: డ్రాగన్ లో స్పెషల్ వెపన్?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(NTR) హీరోగా, ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డ్రాగన్ (Dragon)(వర్కింగ్ టైటిల్)పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, మేకర్స్ మాత్రం కట్టుదిట్టమైన గోప్యత పాటిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్, క్యారెక్టర్ డిజైన్ విషయంలో ఒక్క చిన్న లీక్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తారక్(Tarak)ను ఈ సినిమాలో పూర్తిగా కొత్త అవతారంలో, ఊహించని మాస్ యాంగిల్లో ప్రెజెంట్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నీల్ స్టైల్ అంటే ఎలివేషన్స్, ఇంటెన్స్ యాక్షన్, హై వోల్టేజ్ సన్నివేశాలు అన్న విషయం తెలిసిందే కాబట్టి, ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది.
ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాపై ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేతిలో ఒక ప్రత్యేకమైన ఆయుధం ఉండబోతుందట. గతంలో సింహాద్రి, సాంబ వంటి సినిమాల్లో కనిపించిన పవర్ఫుల్ ఆయుధాల తరహాలోనే, కానీ మరింత ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ వెపన్‌ను ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ కోసం రూపొందించించారనే ప్రచారం జరుగుతోంది. కథలో ఆ ఆయుధానికి కీలకమైన ప్రాధాన్యం ఉంటుందని, అది హీరో క్యారెక్టర్‌ను మరింత ఎలివేట్ చేసే విధంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
![]()
ఇంకా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు, రక్తపాతం భారీ స్థాయిలో ఉంటాయని కూడా ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. ప్రశాంత్ నీల్ సినిమాల శైలిని బట్టి చూస్తే, ఇంటెన్స్ డ్రామాతో పాటు హై ఓక్టేన్ ఫైట్లు తప్పనిసరిగా ఉంటాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టే ఈ చిత్రం రూపొందుతోందని టాక్. మొత్తానికి “డ్రాగన్”పై వస్తున్న ఈ క్రేజీ గాసిప్స్‌కు క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచే అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అప్పటివరకు ఈ హైప్ మాత్రం ఇలాగే కొనసాగడం ఖాయం.
ఇవి కూడా చదవండి

















