సముద్రంలో నేహా అందాల విందు
డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో రాధికగా నిలిచిపోయిన నేహా శెట్టి(Neha Shetty), ఆ సినిమాలో తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంది. సినిమాలతో పాటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను రెగ్యులర్ గా షేర్ చేసే నేహా, తాజాగా మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లి అక్కడ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో నేహా, వైట్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా ఎంతో అందంగా మెరిసిపోతుంది. ఈ డ్రెస్ లో నేహాను చూసిన వారి గుండెల్లో వేసవి తాపం మరింత ఎక్కువవుతూ, ఆ ఫోటోలను నెట్టింట తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.






