Mrunal Thakur: బ్లాక్ అవుట్‌ఫిట్ లో చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్న సీత

సీతారామం(sitaramam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ ఠాకూర్(Mrunal thakur) ఆ సినిమాలో సీతగా నటించి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన మృణాల్ ప్రస్తుతం డెకాయిట్(dacoit) అనే సినిమాలో నటిస్తోంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మృణాల్ తాజాగా తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మృణాల్ బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్ లో దర్శనమిచ్చి, బల్గారి జువెలరీ ధరించి ఆ అభరణాలు హైలైట్ అయ్యేలా ఫోటోలకు పోజులివ్వగా ఈ డ్రెస్ లో మృణాల్ చూపుతిప్పుకోనివ్వడం లేదంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.