Auto drivers: ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికసాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభించారు. విజయవాడ సింగ్‌నగర్‌లోని బసవపున్నయ్య స్టేడియం (Basavapunnaiah Stadium) లో కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల (Auto drivers) కు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందించింది. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్ల మేర ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఆటో డ్రైవర్లు 2.64 లక్షల మంది, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.