Nara Lokesh: అవి చదువుతూ ఉంటే .. వారి మనస్సు ఏంటో తెలుస్తుంది : లోకేశ్

గ్రామస్థాయి నుంచి దేశ రాజకీయాలన్నీ ఆటో డ్రైవర్లే చర్చిస్తుంటారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో పతకం ప్రారంభం కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడారు. ఆనాడు ఎన్టీఆర్ (NTR) ఖాకీ డ్రెసు వేసుకుని చైతన్యరథంపై పర్యటించారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ పలకరిస్తారు ఆటో డ్రైవర్లు (Auto drivers) . నేను కూడా ఆటో వెనుక కొటేషన్లు చదువుతూ ఉంటా. అవి చదువుతూ ఉంటే వారి మనస్సు ఏంటో అర్థమవుతుంది. ఆటోలో ఏ వస్తువు మరిచిపోయినా పోలీసుల (Police) కు ఇస్తారు. యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చినట్లుగా ఆటో డ్రైవర్లను ఆదుకొనేందుకు ముందుకొచ్చాం కూటమి ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్‌ను తగ్గించాం. రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టి గుంతలకు మరమ్మతులు చేశాం అని తెలిపారు.