Amaravati:అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి

రాజధాని అమరావతి (Amaravati)లో రాబోయే ఐదేళ్లలో రూ.6 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మలేసియా (Malaysia) కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. మలేసియాలోని సెలాంగార్ స్టేట్ ఎక్స్‌కో మంత్రి పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గనబతిరావ్‌తో కూడిన మలేసియా ప్రతినిధుల బృందం రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరిశీలించాక ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ను సచివాలయంలో కలిసింది. మలేసియాలో తెలుగు మూలాలున్న పారిశ్రామికవేత్తలకు చెందిన పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోయే పెట్టుబడుల ప్రణాళికను ఆ బృందం వివరించింది. ప్రధానంగా విద్య, పర్యాటకం, ఆతిథ్యం, వాణిజ్యం, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మలేసియా కంపెనీలు ఆసక్తి చూపాయి.
అమరావతిలో వైద్య విశ్వవిద్యాలయ ఏర్పాటుకు మలేసియాలోని సైబర్ జయ యూనివర్సిటీ ముందుకొచ్చిం ది. ఫైవ్‌స్టార్ హోటల్ ఏర్పాటుకు బెర్జయా గ్రూపు సంసిద్ధతను వ్యక్తం చేసింది. చంద్రబాబు విజన్, నాయకత్వం లో అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. మేము భారత ప్రభుత్వంతో అమరావతి అభివృద్ధికి కృషి చేస్తాం. మలేసియాలో తెలుగు మూలాలున్న పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నారు అని మలేసియా మంత్రి పప్పారాయుడు (Papparayudu) అన్నారు. అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ రాజధానుల స్థాయికి తీసుకెళ్లాలని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.