Nirav Modi: త్వరలోనే భారత్‌కు నీరవ్‌మోదీ?

పంజాబ్ నేషనల్ బ్యాంకు కు రూ.వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) ప్రస్తుతం లండన్ (London) జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీని త్వరలోనే భారత్ (India) కు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. బ్రిటన్ అధికారులు వచ్చే నెల అంటే నవంబర్ 23న నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అతన్ని ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంచనున్నట్లు సమాచారం.