Dussehra : దసరా వేళ అల్లుడికి 100 రకాల వంటకాలతో విందు

దసరా (Dussehra) కు అల్లుడు ఇంటికి వచ్చాడని 101 రకాల ఆహారపదార్థాలతో భోజనాన్ని సిద్ధం చేయాలనుకున్నారు ఆ అత్తామామలు. ఆ అల్లుడూ ఆశ్చర్యపోయాడు. ఈ విస్తరిలో 101 రకాలకు ఒక్కటి తగ్గినా ఏమిస్తారని అత్తా -మామల్ని సరదాగా అడిగాడు. 101 రకాలకు ఒక్కటి తగ్గినా, తులం బంగారం ఇస్తామన్నారు. ఆ ఆల్లుడు ఒకటికి రెండుసార్లు లెక్కపెట్టాడు. అందులో వంద మాత్రమే ఉండటంతో అటు భోజనంతో పాటు ఇటు తులం బంగారం దక్కించుకుని దసరా వచ్చిందయ్యా బహుమతి ఇచ్చిందయా అంటూ గొప్పగా సంతోషపడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి (Wanaparthy) జిల్లా కొత్తకోట (Kothakota) పురపాలికలో జరిగింది.
రెండు నెలల కిందట గుంత సురేశ్, సహనల కుమార్తె సింధు వివాహాన్ని తిరుపతిలో జరిపించారు. వారి వివాహమైన తర్వాత వచ్చిన తొలి పండగ దసరా కావడంతో వరంగల్ నుంచి పండగకు అల్లుడు నిఖిత్ ఇంటికి వస్తే తెలంగాణకు చెందిన 60 కాల స్వీట్లు, 30 కరాల పిండి వంటలు, అన్నంతో కలిపి 10 రకాలతో భోజనాన్ని వడ్డించారు. పసందైన భోజనం పెట్టాలనుకున్నారు. 101 రకాలకు ఒక్కటి తగ్గడంతో ఆ తెలివైన అల్లుడు భోజనంతో పాటు బంగారాన్ని దక్కించుకున్నాడు.