Jubilee Hills: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఉద్ఘాటించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ (Secunderabad) కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలోనూ అధికార కాంగ్రెస్‌ని గెలిపించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా తమ ప్రభుత్వం పని చేస్తోందని వ్యాఖ్యానించారు. ఎర్రగడ్డ డివిజన్ (Erragadda Division) లో రూ.2.16 లక్షలతో సీసీ రోడ్లకు, కమ్యూనిటీ హాల్‌కి శంకుస్థాపన చేశామని తెలిపారు.రూ.54 లక్షలతో మురుగు నీటి కాలువల పునరుద్ధరణకు శంకుస్థాపన చేసుకున్నామని వెల్లడించారు. దీని పక్కన ఉన్న స్థలంలో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్క్ ఏర్పాటు చేసుకుంటున్నామని వివరించారు. రేపటి నుంచి పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. వాకింగ్ ట్రాక్ ,పిల్లల గేమ్స్ తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.