Fathima Sana: వ్యక్తిగత అభివృద్ధి కూడా ముఖ్యమే
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి ఫాతిమా సనా షేక్(fathima sana shaik) మరోసారి తన ఆలోచనలతో చర్చనీయాంశంగా మారారు. దంగల్(Dangal) మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు తన కెరీర్ ఎంపికల విషయంలో స్పష్టమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, నటిగా ఎదగాలంటే సవాళ్లతో కూడిన పాత్రలే అవసరమని, కంటెంట్ ఉన్న కథలే తనను ఎక్కువగా ఆకర్షిస్తాయని వెల్లడించారు. కమర్షియల్ మూసలకు మాత్రమే పరిమితం కాకుండా వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకోవాలనే ఆమె సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది.
కేవలం నటనకే పరిమితం కాకుండా వ్యక్తిగత అభివృద్ధి కూడా ముఖ్యమని ఫాతిమా అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తి తన ఉద్యోగంతోనే కాకుండా, తనను తాను అర్థం చేసుకోవడంపై కూడా దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. కొత్త విషయాలను నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా జీవితం మరింత అర్థవంతమవుతుందని ఆమె చెప్పిన మాటలు యూత్‌కు ప్రేరణగా నిలుస్తున్నాయి. తన ఆలోచనల్లో కనిపిస్తున్న పరిపక్వత ఆమెను కేవలం నటిగా కాకుండా ఒక ప్రేరణాత్మక వ్యక్తిగా నిలబెడుతోంది.
ఇదిలా ఉంటే, ఫోటోగ్రఫీపై ఉన్న ఆసక్తి ద్వారా తన క్రియేటివ్ కోణాన్ని కూడా ఫాతిమా వెల్లడించారు. కెమెరా ముందు నటించడం ఎంత ఇష్టమో, కెమెరా వెనుక ఉండటంలో కూడా అంతే ఆనందం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తాను నటి అయినప్పటికీ వ్యక్తిగతంగా మంచి కూతురు, స్నేహితురాలు కూడా అని చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక ఆమె తదుపరి ప్రాజెక్ట్‌గా థ్రిల్లర్ నేపథ్యంలోని టీన్ కౌవే(teen Kauwe) వెబ్ సిరీస్‌తో ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి






