Anaganaga OTT: ‘అనగనగా’ మే 15న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్
సుమంత్ కుమార్ (Sumanth Kumar) లీడ్ రోల్ లో సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనగనగా’ (Anaganaga). కాజల్ చౌదరి కథానాయిక. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మే 15 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.
డైరెక్టర్ సన్నీ సంజయ్ అందరికీ కనెక్ట్ అయ్యే కథని హార్ట్ టచ్చింగ్ గా ప్రజెంట్ చేశారని ప్రమోషనల్ కంటెంట్ హామీ ఇచ్చింది.
ఈ థాట్ ప్రొవొకింగ్ అండ్ హార్ట్ వార్మింగ్ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.






