Kantha: కాంత మూడు రోజుల కలెక్షన్లు ఎంతంటే?
దుల్కర్ సల్మాన్(dulquer salman), భాగ్యశ్రీ బోర్సే(bhagyasri borse), సముద్రఖని(samudrakhani), రానా(rana) ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం కాంత(kantha). నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్డ్స్ టాక్ వచ్చింది. కంటెంట్ పరంగా సినిమా కాస్త స్లో గా ఉన్నా, మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నా, సినిమాలో ఒక్కొక్కరి పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉందని సినిమా చూసిన వారంతా కామెంట్స్ చేస్తున్నారు.
పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా బాగానే సందడి చేస్తోంది. మొదటి మూడు రోజుల్లో కాంత సినిమాకు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు మూడు రోజుల్లో రూ.24.50 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు దక్కినట్టు చిత్ర వర్గాలు అధికారికంగా పోస్టర్ ద్వారా వెల్లడించింది. కాంత లోని కథ, డ్రామా ఆడియన్స్ ను మెప్పించడం సంతోషంగా ఉందని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.
కాగా కాంత మూవీలో రానా పోలీస్ క్యారెక్టర్ లో కనిపించగా, ఆ పాత్ర ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటుంది. సెల్వమణి సెల్వరాజ్(selvamani selvaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా నిర్మించగా, కాంత లాంటి సినిమాలు ఇండస్ట్రీలో మరిన్ని రావాలని, ఇలాంటి మంచి కథలు చెప్పే అవకాశం ప్రతీ సారీ రాదని చిత్ర ప్రమోషన్స్ లో రానా, దుల్కర్ ఇద్దరూ చెప్పారు.






