Etala Rajender: గెలిచినా, ఓడినా, ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ : ఈటల రాజేందర్
కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) అభిప్రాయపడ్డారు. గెలిచినా, ఓడినా, అధికారంలో ఉన్నా, లేకపోయినా దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ (BJP) అని అభివర్ణించారు. సికింద్రాబాద్ గాయత్రి గార్డెన్స్ లో కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు బాణుక నర్మదతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్లో (Jubilee Hills) ఆరు నెలల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) ఎన్నికల కార్యాచరణ ప్రారంభించాయన్నారు.
బీజేపీ ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లనే జూబ్లీహిల్స్లో ఓడిపోయామన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డబ్బులు, చీరలు పంపిణీ చేసి అధికార ధుర్వినియోగానికి పాల్పడి గెలించిందన్నారు. బిహార్లో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమన్నారు. నగరంలో పాలనా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని, డ్రైనేజీ వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్య నిర్వహణ సరిగా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న రెండు పడకల ఇళ్లను అర్హులకు కేటాయించాలన్నారు. పేదల ఇళ్లను కూల్చొద్దని హైడ్రాను కోరారు.






