Panchayat elections:10 రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ?
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు (Panchayat elections) సర్కారు సిద్ధమవుతోంది. పది రోజుల్లోనే నోటిఫికేషన్ (Notification) రానుంది. తొలుత గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించడంతో ఆ మేరకు కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం అమల్లో ఉన్నరాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు (Panchayat elections) సర్కారు సిద్ధమవుతోంది. పది రోజుల్లోనే నోటిఫికేషన్ (Notification) రానుంది. తొలుత గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించడంతో ఆ మేరకు కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 23 శాతం బీసీ రిజర్వేషన్ (BC Reservation) , మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోపు ఉండేలా, గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రత్యేక కమిషన్ను ప్రభుత్వం కోరనుంది. ఈ కమిషన్ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి వారం రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. రిజర్వేషన్ల జాబితా అందిన రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అంటే పది రోజుల్లో గ్రామాల్లో ఓట్ల పండగ ప్రారంభం కానుందన్నమాట. ఈ ఎన్నికలు పార్టీ రహితం అయినప్పటికీ, పార్టీ తరఫున సర్పంచ్ (Sarpanch), వార్డు అభ్యర్థులుగా పోటీ చేసే వారిలో కనీసం 42ు మంది బీసీలు ఉండాలని, గరిష్ఠంగా 60 శాతం వరకు అవకాశం ఇద్దామని సీఎం రేవంత్రెడ్డి మంత్రులకు సూచించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ ఎన్నికలు నిర్వహించకుంటే ఆర్థిక సంఘం నిధులు రూ.3 వేల కోట్లు మురిగిపోనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు.






