ఉద్యోగులకు.. విప్రో శుభవార్త!

ఐటీ రంగ దిగ్గజం విప్రో లిమిటెడ్ తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. కనీసం 80 శాతం ఉద్యోగులకు జీతాలను పెంచుతున్నట్లు విప్రో సంస్థ ప్రకటించింది. అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో మరియు అంతకంటే తక్కువ ఉన్నవారికి, ఈ పెంపు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని విప్రో సంస్థ పేర్కొంది. ఇంతలో మేనేజర్ స్థాయిలో మరియు అంతకంటే ఎక్కువ ఉన్నవారికి జూన్ 1 నుంచి జీతం పెంపు లభిస్తుందని సంస్థ తెలిపింది. 2021 సంవత్సరంలో రెండు సార్లు జీతాలను పెంచినట్లు విప్రో సంస్థ ప్రకటించింది.