మైక్రోసాఫ్ట్ నుంచి.. మరో అద్భుతం

సాఫ్ట్ వెర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన విండోస్ ఆపరేటింగ్ సిస్టం (ఓఎస్) శ్రేణిలో తదుపరి ఆవిష్కరణను తీసుకొచ్చింది. వినియోగదారులను ఆకర్షించే సరికొత్త సదుపాయాలతో విండోస్ 11 ఓఎస్‍ను వర్చువ్ విధానంలో ఆవిష్కరించింది. 2015లో విండోస్ 10ను విడుదల చేసిన తరువాత మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన కీలక ఆవిష్కరణ ఇదే. వచ్చే పదేళ్ల వరకూ వినియోగదారుల అవసరాలను తీర్చేలా దీన్ని రూపొందిస్తున్నాం. విండోస్ చరిత్రలో ఇదో పెద్ద మైలు రాయి అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ సందర్భంగా పేర్కొన్నారు.
విండోస్ 11లో స్టార్ట్ మెనూ కొత్తగా ఉండబోతోంది. టాస్క్ బార్, ఫాంట్, ఐకాన్‍ల విషయంలోనూ సరికొత్త అనుభూతిని అందించనుంది. ఈ ఓఎస్ ద్వారా తొలిసారిగా విండోస్ ఆండ్రాయిడ్ యాప్‍లను కూడా వినియోగించుకునే సదుపాయం అందించబోతోంది. ఈ ఏడాది చివరికల్లా కొత్త కంప్యూటర్లతో పాటు విండోస్ 10 వినియోగదారుకలూ కొత్త ఓఎస్ ఉచితంగా అందుబాటులోకి వస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.