న్యూయార్క్‌కు ఉలవపాడు మామిడి
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఉలవపాడు మామిడి అమెరికాలోని న్యూయార్క్‌కు చేరింది. ఈ ఏడాది మామిడిపండ్ల నాణ్యత సరిగా లేకపోవడంతో విదేశాలకు ఎగుమతి కాలేదు. అయితే కవర్లు కట్టిన మామిడిపండ్ల నాణ్యత సరిగా లేకపోవడంతో విదేశాలకు ఎగుమతి కాలేదు. అయితే, కవర్లు కట్టిన మామిడిపండ్ల నాణ్యత బాగుండడంతో ఉలవపాడులోని రైతు స్ఫూర్తి ఆర్గనైజేషన్ వారు గుర్తించి ఎగుమతి చేసేందుకు బెంగళూరులోని ఇన్నోవా ప్యాక్ హౌస్ సభ్యులతో చర్చించారు. రైతు స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలచంద్ర వారం రోజులపాటు ఇన్నోవా ప్యాక్ హౌస్ సభ్యులతో మాట్లాడి న్యూయార్క్‌కు ఎగుమతి చేసేలా ఒప్పించారు. ఈ మేరకు రెండు రోజుల కిందట ఉలవపాడు బంగినపల్లె రకం మామిడిపండ్లు బెంగళూరు నుంచి విమానంలో న్యూయార్క్ నగరానికి చేరుకున్నాయి.






