గూగుల్ కు దక్షిణ కొరియా జరిమానా
గూగుల్‌కు వరుసబెట్టి దెబ్బలు తగులుతున్నాయి. ఈ మధ్యే పార్లమెంట్లో ప్రత్యేక చట్టం ద్వారా గూగుల్, అపిల్ ప్లేస్టోర్ మార్కెటింగ్‌కు భారీ దెబ్బ కొట్టింది. దక్షిణ కొరియా తాజాగా గూగుల్‌కు ఏకంగా 207 బిలియన్ వన్ల అంటే 176 మిలియన్ డాలర్ల భారీ జరిమానా విధించింది. ఆల్ఫాబెట్ కంపెనీకి చెందిన గూగుల్‌కు దక్షిణ కొరియా యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ భారీ జరిమానా విధించింది. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్ పోటీలో నైతిక విలువల్ని గూగుల్ విస్మరించిందని, ఆధిపత్య పోరులో ఇతర కంపెనీలను నిలువరించడం ద్వారా పోటీతత్వానికి విరుద్దంగా వ్వవహరించిందని కొరియా ఫెయిర్ ట్రేడ్ కమిషన్ చెబుతోంది.
ఈ మేరకు 176 బిలియన్ డాలర్ల జరిమానా విధించడంతో పాటు కోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి వీల్లేకుండా వెంటనే ఆ జరిమానాలను కట్టాలంటూ గూగుల్‌కు అదేశాలు జారీ చేసింది. ఫోన్లలో ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉపయోగించకుండా గూగుల్ అడ్డుకుంటోందని లోకల్ స్మార్ట్‌ఫోన్ మేకర్ల ఆరోపణలపై కెఎఫ్టీసి దర్యాప్తు చేసింది. ఈ మేరకు దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలడంతో దక్షిణ కొరియా ఇలా భారీ జరిమానా విధించింది.






