ముకేశ్ అంబానీకి షాక్ ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీతో పాటు మరో రెండు సంస్థలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొరడా ఝుళిపించింది. 2007 నవంబర్లో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్) షేర్ల ట్రేడింగ్ సందర్భంగా అక్రమాలు జరిగాయన్న అభియోగాలతో ఆర్ఐఎల్కు రూ.25 కోట్లు, అంబానీకి రూ.15 కోట్లు జరిమానా విధించింది. అలాగే నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్ను రూ.20 కోట్లు, ముంబై సెజ్ లిమిటెడ్ను రూ.10 కోట్లు పెనాల్టీ చెల్లించాలని ఆదేశించింది.






